Breaking News

'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?

Published on Sun, 11/16/2025 - 16:56

మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఫిక్స్ అయింది. నిన్నటివరకు రకరకాల పేర్లు వినిపించాయి గానీ చివరకు దీనికి జక్కన్న కట్టుబడి ఉన్నారు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్‍‌లో 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పేరిట భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిన్న చిన్న ఇ‍బ్బందులు మినహా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతకీ ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి?

సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తుంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తుంటారు. ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఏడాది క్రితమే టైటిల్, గ్లింప్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు. అయితే అనివార్య కారణాల వల్ల  ఆలస్యమవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు.

(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)

టైటిల్ లాంచ్‌ని ఏదో ఆషామాషీగా కాకుండా 100x130 అడుగల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు. కేవలం ఈ స్క్రీనింగ్ సెటప్ కోసమే రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశారట. మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి రూ.10-15 కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది.

ఎందుకంటే టీజర్ కోసమో, గ్లింప్స్ వీడియో కోసమే ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం. కానీ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజులో కోట్లు ఖర్చు పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అనిపిస్తుంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి.. ఈసారి ప్రపంచవ్యాప్తం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలనే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చూస్తే అది అనిపించింది కూడా.

(ఇదీ చదవండి: రాజమౌళిపై హనుమాన్‌ భక్తులు ఫైర్‌)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)