Breaking News

ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా

Published on Sun, 05/18/2025 - 17:28

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

 

పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. 'ఏ మాయ చేశావె'లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'ఎస్ఎమ్ఎస్' మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.

వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు. 

(ఇదీ చదవండి: నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?) 

మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.

సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)