Breaking News

5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..

Published on Sat, 06/28/2025 - 14:28

కరాటేలో బ్లాక్‌బెల్ట్‌.. డ్యాన్సర్‌, మోడల్‌. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్‌ ఆనంద్‌ (Mahesh Anand).

కెరీర్‌
1982లో సనమ్‌ తేరీ కసం మూవీలో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత కమల్‌ హాసన్‌ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్‌ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్‌ కాకపోవడంతో విలన్‌గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్‌లో కరడుగట్టిన విలన్‌గా పేరు గడించిన మహేశ్‌ ఆనంద్‌.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్‌, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్‌ వన్‌, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.

ఐదు పెళ్లిళ్లు
వెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్‌ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 

అవకాశాలు దూరం
అనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్‌ కెరీర్‌ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్‌.. 2015లో రష్యన్‌ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. 

పేదరికంలో మగ్గిన నటుడు
వందల సినిమాలు చేసిన మహేశ్‌.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్‌ బ్రదర్‌ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్‌ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.

మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం
2019 ఫిబ్రవరి 9న మహేశ్‌ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.

చదవండి: ఆ డైరెక్టర్‌ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)