Breaking News

'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా

Published on Mon, 07/28/2025 - 13:19

కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్‪‌తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.

ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)

ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.

సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.

(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్‌, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్‌!)

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)