Breaking News

'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌.. కలెక్షన్స్‌ ఎంతో తెలుసా..?

Published on Sun, 07/27/2025 - 13:07

'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' యానిమేటెడ్‌ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మ‌హా విష్ణువు ద‌శావ‌తారాల ఆధారంగా 'మ‌హావ‌తార్' సినిమాటిక్ యూనివ‌ర్స్ (ఎమ్‌.సి.యు) పేరుతో తొలి చిత్రంగా జులై 25 విడులైంది. క్లీమ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్ర‌ఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా చిత్రాలను పాన్ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ యూనివ‌ర్స్‌లో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ బాక్సాఫీస్వద్ద మెప్పిస్తుంది. చాలాచోట్ల థియేటర్స్‌ కూడా హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. అయతే, హరిహర వీరమల్లు వల్ల పెద్దగా ఈ చిత్రానికి థియేటర్స్‌ దొరకలేదు.  కానీ, మొదటిరోజునే మంచి టాక్రావడంతో మెల్లిగా బాక్సాఫీస్వద్ద జోరందుకుంటుంది.

యానిమేటెడ్రూపంలో తెరకెక్కిన భారతీయ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్రావడం ఇదే మొదటిసారని సినిమా క్రిటిక్స్చెబుతున్నారు. 'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' విడుదలైన మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్రాబట్టింది. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్క్రియేట్చేసింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్కలెక్షన్స్తో రికార్డ్క్రియేట్చేసింది. ఇదే కలెక్షన్స్గ్రాస్పరంగా చూస్తే రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, నేడు ఆదివారం కావడంతో బుక్మైషోలో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాకు మంచి టాక్రావడంతో రోజురోజుకు టికెట్లు తెగడం పెరుగుతుందని చెప్పవచ్చు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి తాజా నిదర్శనం 'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌'. నరసింహ స్వామి, భక్త ప్రహ్లాదుడు ఇతివృత్తాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి కూడా. అదే ఇతిహాసంతో యానిమేషన్‌ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఈ చిత్రానికి జయ పూర్ణ దాస్‌ కథను, అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీఎస్‌ శ్యామ్‌ సంగీతాన్ని, అందించిన ఈ భక్తి రస చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి ఎత్తిన అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మహావతార్‌ నరసింహ. ఇది పూర్తిగా యానిమేషన్లో రూపొందడం విశేషం.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు