ఓటీటీలో వివాదాస్పద సినిమా..తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Published on Sat, 06/22/2024 - 16:53

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం 'మహారాజ్' విడుదలకు ముందే చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. హిందూ మతాన్ని దూషించేలా సినిమా ఉందని గుజరాత్ కోర్టులో పిటీషన్‌ వేయడంతో సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. వాస్తవంగా ఈ సినిమా జూన్‌ 14న విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదల కాలేదు. అయితే, తాజాగా  మహారాజ్‌ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

మహారాజ్ సినిమా ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జూన్‌ 21  నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. ఒక మతాన్ని కించపరిచేలా ఈ చిత్రం లేదని న్యాయస్థానం వెళ్లడించింది. దీంతో ఈ మూవీని నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి ఊరట లభించినట్లు అయింది. అయితే, ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా మహారాజ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది.

మహారాజ్ చిత్రంలో జునైద్‍ ఖాన్‍తో పాటు షాలినీ పాండే, జైదీప్ అహల్వాత్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహించారు.  1860 బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా రూపొందింది. జర్నలిస్ట్, సామాజిక సంస్కర్త కర్సన్‍దాస్ ముల్జీ జీవితం గురించి ఈ చిత్రం ఉంది. 1862 సమయంలో హిందూ మతానికి చెందిన ఓ బాబా అన్యాయాలను ముల్జీ బహిర్గతం చేయడం వంటి అంశాలతో ఈ చిత్రం కథ సాగింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)