Breaking News

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మహాభారత్‌ నటుడు కన్నుమూత!

Published on Wed, 10/15/2025 - 15:04

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ ధీర్(Pankaj Dheer) ( 68) ఇవాళ కన్నుమూశారు. కొన్నేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే క్యాన్సర్‌కు పలుసార్లు శస్త్ర చికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ముంబయిలోని విలే పార్లేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

(ఇది చదవండి: తొలి తెలుగు సింగర్‌ ఇక లేరు)

కాగా.. పంకజ్ ధీర్ నవంబర్‌ 9..  1956న పంజాబ్‌లో జన్మించారు. 1980 ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో బుల్లితెరతో పాటు సినిమాల్లో నటించారు. బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్‌ సీరియల్‌లో కర్ణుడి పాత్రలో మెప్పించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. మహాభారతంతో పాటు చంద్రకాంత(1994–1996), ది గ్రేట్ మరాఠా, ససురల్ సిమర్ కా లాంటి  సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా సడక్, బాద్షా, సోల్జర్ వంటి చిత్రాలలో కూడా కనిపించారు.

‍అయితే అనితా ధీర్‌ను పంకజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కూడా నటనలో రాణిస్తున్నారు. ఆయన కుమారుడు నికితిన్ బుల్లితెర నటి క్రతికా సెంగర్‌ను వివాహం చేసుకున్నాడు. అతను తన తండ్రి పంకజ్‌ ధీర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)