పాకిస్తాన్‌ వ్యాపారి కోసం 'మాధురి దీక్షిత్' వివాదాస్పద నిర్ణయం

Published on Sat, 06/29/2024 - 16:00

మాధురి దీక్షిత్ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. 1990ల్లో  స్టార్ ‍హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాధురి దీక్షిత్‌.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితో  నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. 1984లో అబోద్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మాధురి దీక్షిత్.. శ్రీదేవి వంటి స్టార్‌ హీరోయిన్‌లకు కూడా అందనంత ఎత్తులో నిలబడింది. అయితే, తాజాగా ఆమె చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

ఓ కంపెనీకి చెందిన యాడ్‌ విషయంలో మాధురి దీక్షిత్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్‌ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త రెహన్‌ సిద్ధిఖీ తన వ్యాపారా సామ్రాజ్యాన్ని పెంచుకునే క్రమంలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాడు. ఆగష్టు నెలలో తనకు చెందిన కంపెనీల ప్రమోషన్‌ కార్యక్రమాన్ని టెక్సాస్‌లో నిర్వహించనున్నాడు. 

అయితే, ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవరించేందుకు మాధురి దీక్షిత్‌ టెక్సాస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిని భారతీయులు తప్పుబడుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని నెట్టింట పెద్ద ఎత్తున్న కామెంట్లు చేస్తున్నారు. దీనంతటికి కారణం  పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో రెహన్‌ సిద్ధిఖీకి సంబంధాలున్నాయంటూ.. ఆయన నిర్వహించే అన్నీ కంపెనీలను భారత్‌ బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. 

టెక్సాస్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. అందులో రెహన్‌ సిద్ధికీ, మాధురిదీక్షిత్‌ ఫొటోలున్నాయి. దీంతో ఆమె ఆ కార్యక్రమానికి వెళ్తున్నట్లు తేలిపోయింది. ముందుగా రెహన్‌ సిద్ధిఖీ ఎలాంటి వాడో తెలుసుకొని ఆ కార్యక్రమానికి మాధురి దీక్షిత్‌ వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే, ఈ గొడవ గురించి మాధురి దీక్షిత్‌ ఇంకా స్పందించలేదు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)