Breaking News

ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

Published on Tue, 06/02/2026 - 12:25

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా ధురంధర్, పేట్రియాట్, కేడీ, కార్మేని సెల్వం, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తాజాగా మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: 'బ్లాస్ట్' సినిమా ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా)

జో శర్మ అనే ఇండో-అమెరికన్ నటి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా 'ఎమ్4ఎమ్'. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ మే 8న థియేటర్లలో రిలీజైంది. కానీ పేరున్న నటీనటులు లేకపోవడం, కథాకథనాలు ఏమంత గొప్పగా లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఈ నెల 19 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లోకి కూడా రావొచ్చు.

'ఎమ్4ఎమ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లో స్టార్ హీరో రంజిత్ (కృష్ణతేజ) హత్యకు గురవుతాడు. ఓ సీరియల్ కిల్లర్ ఇతడిని చంపేసి, పెయింటింగ్ ఆకారంలో న్యూడ్‌గా పెడతాడు. ఈ కేసుని ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య) దర్యాప్తు చేస్తుంటాడు. ఇతడి భార్య రాధ (జో శర్మ) ఓ న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తుంటుంది. భార్యభర్తలిద్దరూ కలిసి ఈ కేసులో విచారణ చేస్తుంటారు. కిల్లర్ మాత్రం వీళ్లకు దొరక్కుండా వరస హత్యలు చేస్తుంటాడు. ఎక్కడెక్కడ చంపబోతున్నానని చెప్పి ముందే పోలీసులకు వాయిస్ మెసేజ్ పంపి సవాలు విసురుతాడు. ఇంతకీ ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యల వెనకున్న కారణమేంటి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)