దళపతి చివరి సినిమాలో ముగ్గురు స్టార్ దర్శకులు?

Published on Sat, 08/23/2025 - 21:16

తమిళ స్టార్ దళపతి విజయ్.. రీసెంట్‌గానే మధురైలో భారీ బహిరంగ సభ పెడితే ఏకంగా లక్షలాది మంది అభిమానులు వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్న విజయ్.. మరోవైపు తన చివరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనూ ఉన్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్‍‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు)

విజయ్ 'జన నాయగన్'... తెలుగు చిత్రం 'భగవంత్ కేసరి' రీమేక్ అని ప్రచారం అయితే ఉంది కానీ నిజమేంటి అనేది మూవీ రిలీజైతే తప్ప తెలియదు. అయితే ఇది విజయ్ చివరి చిత్రమని ప్రచారం నడుస్తోంది కాబట్టి ఇందులో పలు సర్‌ప్రైజులు ఉండబోతున్నాయట. తమిళ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్, లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ రూమర్ గట్టిగానే వినిపిస్తుంది.

ఈ ముగ్గురు దర్శకులు కూడా విజయ్‌తో సినిమాలు తీశారు. అట్లీ, లోకేశ్ తలో రెండేసి చిత్రాలు చేయగా.. నెల్సన్ ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. అలా విజయ్‌పై అభిమానం దృష్ట్యా.. ఇతడి చివరి చిత్రమైన 'జన నాయగన్'లో జర్నలిస్టులుగా చిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. 'ప్రేమలు' మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. హెచ్. వినోద్ దర్శకుడు కాగా అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)