Breaking News

అరుణాచలం శివున్ని దర్శించుకున్న లోకేశ్ కనగరాజ్

Published on Thu, 08/07/2025 - 14:41

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ కూలీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రజినీకాంత్‌ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.

కూలీ రిలీజ్‌కు ముందు దర్శకుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలయంలో లోకేశ్‌ను చూసిన పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ కనగరాజ్‌ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు.

రజినీకాంత్ ‍హీరోగా నటించిన కూలీలో నాగార్జున విలన్‌గా కనిపిచనున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2తో పోటీ పడనుంది.

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)