స్టార్‌ హీరోతో 'లోకేష్‌ కనగరాజ్‌' కొత్త సినిమా ప్రకటన

Published on Thu, 06/05/2025 - 15:14

బాలీవుడ్‌ అగ్ర హీరో ఆమిర్‌ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్‌లో విక్రమ్‌, లియో, ఖైదీ, మాస్టర్‌ వంటి సినిమాలతో టాప్‌ దర్శకుడిగా దేశవ్యాప్తంగా లోకేష్‌ కనగరాజ్‌ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి ఒక బాలీవుడ్‌ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) తన కొత్త సినిమా ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్‌ కనగరాజ్‌తో తాను ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలిపారు.  అత్యంత భారీ స్థాయిలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. సూపర్‌హీరో జానర్‌లో స్టోరీ ఉంటుందని హింట్‌ ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఈ సినిమా గురించి చర్చించుకుందామని  ఆమిర్‌ ఖాన్‌ సూచించారు.

‘పీకే 2’ సినిమా గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని  ఆమిర్‌ ఖాన్‌  అన్నారు. పీకే2 సినిమా చేయాలనే ఆలోచన  లేదని ప్రకటించారు. అయితే, 'దాదా సాహెబ్‌ ఫాల్కే'పై సినిమా చేస్తున్నామని, రాజ్‌ కుమార్‌ హిరాణీతో చర్చలు జరుగుతున్నాయిని చెప్పారు. ‘మహాభారతం’పై సినిమా చేయాలనేది తన 25 ఏళ్ల డ్రీమ్‌ అంటూ ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు. అదొక యజ్ఞంలా  చేయాలనే ఆలోచన ఉంది. చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విషయాలు చెబుతానని  ఆమిర్‌ అన్నారు.

ఇదిలా ఉంటే.. రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్‌ ఖాన్  ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్‌ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత లోకేష్‌ మరో కొద్దిరోజులు గ్యాప్‌ తీసుకుని ఆమిర్‌ సినిమా చేయనున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)