Breaking News

'కొత్త లోక' సరికొత్త రికార్డ్.. దీనిదే అగ్రస్థానం

Published on Wed, 09/03/2025 - 16:03

హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే చాలామంది ప్రేక్షకులకు చిన్నచూపు. హా ఏముందిలే అని అనుకుంటారు. కానీ అప్పట్లోనే విజయశాంతి లాంటి హీరోయిన్స్.. 'కర్తవ్యం' లాంటి సినిమాలు చేశారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో హీరోలు, కమర్షియల్ చిత్రాల హవా పెరిగేసరికి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ రావడం బాగా తగ్గిపోయింది. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం దక్షిణాదిలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి.

గత కొన్నేళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే అనుష్క గుర్తొస్తుంది. 'అరుంధతి'తో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత రుద్రమదేవి, భాగమతి తదతరత చిత్రాలతో తన సకెస్స్‌ని కొనసాగించింది. తర్వాత కాలంలో పలువురు సౌత్ హీరోయిన్లు.. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీసినప్పటికీ అనుష్క దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. కానీ 'మహానటి' మూవీతో కీర్తి సురేశ్ ఆ ఫీట్ సాధించింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

(ఇదీ చదవండి: 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్)

2018లో 'మహానటి' రాగా ఆ రికార్డ్ అలానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు 'కొత్త లోక' సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం.. రిలీజైన 7 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది. సాధారణంగా చూస్తే ఇదేమంత ఎక్కువ మొత్తంలా అనిపించకపోవచ్చు. కానీ మిడ్ రేంజ్ హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్‌ని లీడ్ రోల్‌లో పెట్టి తీసిన సూపర్ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అంటే కచ్చితంగా విశేషమే.

ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన 'కొత్త లోక'..  ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్ కూడా దాటేసినట్లు తెలుస్తోంది. తద్వారా మహానటి, రుద్రమదేవి, భాగమతి, అరుంధతి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఇది ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)