Breaking News

ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్‌

Published on Wed, 06/04/2025 - 17:15

ఏదైనా ప్రమోషన్‌ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటుంది హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu). ఏవైనా ఉత్పత్తులు మంచివి కావనిపిస్తే సదరు యాడ్స్‌ చేయడం లేదని చెప్పింది. అలా గతేడాది 15 వాణిజ్య ప్రకటలను రిజెక్ట్‌ చేసినట్లు ఇటీవలే వెల్లడించింది. ఏదైనా యాడ్‌ చేయడానికి ముందు ఆ ప్రోడక్ట్‌ను తన దగ్గరున్న ముగ్గురు డాక్టర్లు పరిశీలిస్తారని.. వారి నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.

పూర్తిగా నమ్ముతున్నా..
అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమంత కొన్ని రోజులుగా ఎన్‌ఎమ్‌ఎన్‌ (నికోటినమైడ్‌ మోనోన్యూక్లియోటైడ్‌) అనే సప్లిమెంట్‌ను ప్రమోట్‌ చేసింది. ఇది డీఎన్‌ఏను రిపేర్‌ చేసి మన వయసు పెరగనీయకుండా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు ఈ ఎన్‌ఎమ్‌ఎన్‌ ట్యాబ్లెట్స్‌ తయారు చేస్తున్న గటాకా సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో.. ఈ ట్యాబ్లెట్స్‌ గురించి వాటి ఫలితాలే చెప్తున్నాయి. నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్‌గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్‌కట్స్‌ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం అని రాసుకొచ్చింది.

ఫ్రాడ్‌.. నమ్మొద్దు: డాక్టర్‌
ఇది చూసిన ద లివర్‌ డాక్టర్‌.. సామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్సు తెలియని నటి అని తిట్టిపోశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ సప్లిమెంట్లను ప్రమోట్‌ చేస్తోందని ఆరోపించాడు. పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది.. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదన్నాడు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్‌ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదని విమర్శించాడు.

నిజమైన వైద్యుల్ని నమ్మండి
మీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యంగ్‌గా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్‌ పెట్టమని సూచించాడు. సిగరెట్‌, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దని.. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే విశ్వసించమని కోరాడు. అసలైన వైద్యులు చెప్పేదే వినండంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. కాగా గతంలోనూ సమంత పెట్టిన పలు పోస్టులపై లివర్‌ డాక్టర్‌ విమర్శలు గుప్పించాడు.

 

 

చదవండి: టాలీవుడ్‌ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)