Breaking News

ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే!

Published on Mon, 05/22/2023 - 12:58

గతవారం లాగే ఈ వారం కూడా థియేటర్స్‌లో చిన్న సినిమాలు.. ఓటీటీలతో పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే థియేటర్స్‌లో విడుదలయ్యేవి చిన్న చిత్రాలే అయినా.. మంచి బజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాయి. అలాగే ఓటీటీలోనూ కొన్ని హిట్‌ సినిమాలో స్క్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం. 

మళ్లీ పెళ్లి


నరేశ్‌ వి.కె, పవిత్ర లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్‌ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది.

మేమ్‌ ఫేమస్‌

సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం మేమ్‌ ఫేమస్‌. శరత్‌, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహరన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా..  వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్‌ని క్రియేట్‌ చేసుకుంది.

2018

టొవినో థామస్‌, కుంచకో బోబన్‌, అసీఫ్‌ అలీ, లాల్‌ తన్వి రామ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘2018’. జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై భారీ విజయం సాధించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ మే 26న విడుదల కాబోతుంది. 

మెన్ టూ

న‌రేష్ అగ‌స్త్య, బ్ర‌హ్మాజీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం మెన్ టూ. శ్రీకాంత్ జీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26న థియేటర్స్‌లోకి రాబోతుంది.  వీటితోపాటు జైత్ర‌, గ్రే- ది స్పై హు లవ్డ్ మీ, గోవిందా భ‌జాగోవింద‌ అనే చిన్న సినిమాలు కూడా ఈ వారమే థియేర్స్‌లో సందడి చేయబోతున్నాయి. 

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..
జీ5
కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ (మే 26)
సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (మే 26)
జియో
తోడేలు (మే 26)
అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియో 
సిటాడెట్‌ చివరి ఎపిసోడ్‌
మిస్సింగ్‌ మూవీ(మే 24)

ఆహా 
గీతా సుబ్రహ్మణ్యం సిరీస్‌ -3(మే 23)
సత్తిగాడు రెండెకరాలు(మే 26)
డిన్నీ +హాస్ట్‌స్టార్‌
అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ మే 24
సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ మే 26

Videos

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)