Breaking News

గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ‘జూనియర్‌’.. సాంగ్‌ రిలీజ్‌

Published on Tue, 05/20/2025 - 12:46

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్‌’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్‌ 18న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘లెట్స్‌ లివ్‌ దిస్‌ మూమెంట్‌... లెట్స్‌ లవ్‌ దిస్‌ మూమెంట్‌..’ అనే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జస్ప్రీత్‌ జాజ్‌ పాడారు. విజయ్‌ పొలాకి నృత్య రీతులు సమకూర్చారు. 

ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో కిరిటీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా తీశాం. ‘జూనియర్‌’లోని ప్రతి మూమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో నాకు గాయమైంది. దాంతో కోలుకోడానికి ఏడాది పట్టింది. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ ఆలస్యమైంది. లెజెండరీ యాక్టర్‌ వి. రవిచంద్రన్‌గారు మమ్మల్ని సపోర్ట్‌ చేసేందుకు ఈ సినిమాలో నటించారు’’ అని తెలిపారు. 

‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కిరీటి చాలా హార్డ్‌ వర్క్‌ చేశాడు’’ అని తెలిపారు వి. రవిచంద్రన్‌. ‘‘రవిచంద్రన్, సెంథిల్, దేవిశ్రీప్రసాద్‌గార్లు వంటి సీనియర్స్‌ ఉండటం వల్ల మా ‘జూనియర్‌’ సినిమా ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అవుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు రాధాకృష్ణ. ‘‘కిరీటి యాక్షన్, డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ చాలా సర్‌ప్రైజ్‌ చేశాయి. నటుడిగా అతనికి గొప్ప భవిష్యత్‌ ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ వేడుకలో కొరియోగ్రఫర్‌ విజయ్‌ ΄ోలాకి, ఛాయాగ్రాహకుడు సెంథిల్‌ కుమార్‌ మాట్లాడారు. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)