Breaking News

లెజెండరీ సింగర్ జానకమ్మ అంత్యక్రియలు పూర్తి

Published on Sun, 07/12/2026 - 17:25

గాన కోకిల ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరు సమీపంలోని కణియర హుండి గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ముగిసింది. బ్రాహ్మణ సంప్రదాయంలో జానకమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. జానకి అంత్యక్రియల్లో పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు పాల్గొన్నారు. అంతకుముందు లెజెండరీ సింగర్ చివరి చూపు కోసం అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూర్‌లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్‌కి పార్థీవదేహాన్ని తరలించారు.

ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. 

సినీ ప్రస్థానం.. 

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత. లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్‌ జానకి.

 

janak

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)