భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
అప్పుడు 'లెజెండ్' ఇప్పుడు 'లీడర్'.. యాక్షన్ ట్రైలర్ రిలీజ్
Published on Sun, 03/29/2026 - 16:04
తమిళనాడులో శరవణనన్ స్టోర్స్ అనే వస్త్రదుకాణ యజమానిగా గుర్తింపు తెచ్చుకున్న లెజెండ్ శరవణనన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన 'లెజెండ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రమోషన్ల టైంలోనే విపరీతంగా ట్రోలింగ్‌కి గురైన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత అంతకు మించిన విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ హీరో ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ఈసారి కొత్తగా 'లీడర్' మూవీతో వస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్)
ఈ మూవీకి ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా చేసింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతమందించాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపిస్తున్న ఈ మూవీ అయినా శరవణనన్‌కి హిట్ ఇస్తుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Tags : 1