Breaking News

సుస్మిత దగ్గరే ఎక్కువ వజ్రాలు.. నా ఖర్చులు ఆమెనే భరించేది

Published on Tue, 06/02/2026 - 10:20

ఐపీఎల్ ముగిసింది.‍ ఈ లీగ్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త అయిన లలిత్ మోడీ మాత్రం ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సూర్యవంశీ గురించి మాట్లాడాడు. గతంలో ఇతడు బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. అయితే డబ్బు కోసమే లలిత్‌కి ఈమె దగ్గరైందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వాటిని ఖండించాడు. ఈ క్రమంలోనే సుస్మితా గురించి ఇతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా అనిపించాయి.

(ఇదీ చదవండి: బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా)

'సుస్మితా సేన్ కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గరే ఎ‍క్కువ వజ్రాలున్నాయి. వాటన్నింటినీ ఆమెనే స్వయంగా సంపాదించుకుంది. మేం కలిసున్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు ఆమెనే ఖర్చులన్నీ చెల్లించేది. నేనే ఆమె డబ్బులపై ఆధారపడ్డాను. ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించడానికి ఇష్టపడదు. ఆమె గురించి తెలియని వాళ్లు మాత్రమే అలాంటి ఆరోపణలు చేస్తారు' అని లలిత్ మోడీ క్లారిటీ ఇచ్చాడు.

సుస్మితాతో బంధం గురించి మాట్లాడిన లలిత్ మోడీ.. 'సుస్మితా నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆమె ఎంతో సాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం' అని చెప్పుకొచ్చాడు. 2022లో సుస్మితాతో డేటింగ్‌లో ఉన్నట్లు తనకు తానుగా ప్రకటించుకున్న లలిత్ మోడీ.. తర్వాత బ్రేకప్ అయినట్లు కూడా చెప్పాడు. గతేడాది మరో మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు లలిత్ పోస్ట్ పెట్టాడు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం వదలి పారిపోయిన ఇతడు 2010 నుంచి లండన్‌లో ఉంటున్నాడు. 

(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోయిన్‌ శివానీ నాగారంకి బంపరాఫర్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)