Breaking News

ఓటీటీలోకి వచ్చి నెల రోజులవుతున్నా ట్రెండింగ్‌లో ఉన్న ఖుషి!

Published on Wed, 10/25/2023 - 12:49

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సాంప్రదాయాలు వేరైనా అవి ప్రేమకు అడ్డు రావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఖుషిని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ.

సెప్టెంబర్ 1 పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విప్లవ్‌గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్‌ 1 నుంచి ఖుషి సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలోనూ ఖుషి చిత్రానికి మంచి ఆదరణ వస్తోంది.

హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఖుషి మొదటి నుంచి ఇండియా వైడ్‌ ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 చిత్రాల్లో ఉంటూ వస్తోంది. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి వారాల్లో అయితే తొలి స్థానంలో ట్రెండ్ అయింది. మరీ ముఖ్యంగా హిందీ వర్షన్‌కు అమితమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10లో ఏడో స్థానంలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

చదవండి: రెండో భార్యకు నటుడు విడాకులు.. తొలిసారి స్పందించిన నటి!

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)