Breaking News

కుబేర... తెలుగు 'వీర' లేవరా

Published on Mon, 06/23/2025 - 12:04

తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెలుగులో ఇప్పటిదాకా పలు చిత్రాలు తీశారు. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు అనే పేరు మాత్రం తెచ్చుకోగలిగారు. కానీ ఆయనతో ఇప్పటివరకు తెలుగు అగ్రనటులు ఎవరూ పనిచేయలేదు. ఎందుకని? బహుశా వైవిధ్యభరిత పాత్రలను మాత్రమే ఆయన రూపకల్పన చేస్తారనా? లేదా తమ సూపర్‌‌మ్యాన్‌ ఇమేజ్‌కి తగ్గ హీరో పాత్రల్ని ఆయన సృష్టించలేరనా? ఇప్పుడు శేఖర్‌ కమ్ముల పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మార్మోగుతోంది. ఆయన తీసిన 'కుబేర' కమర్షియల్‌గా మాత్రమే కాకుండా దాదాపు 100శాతం పాజిటివ్‌ రివ్యూలతో అనూహ్య విజయం సాధించింది.

(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

ఇటీవలి కాలంలో ఒక్కసారి పరిశీలించి చూస్తే వెంకీ అట్లూరి, శేఖర్‌ కమ్ముల లాంటి తెలుగు దర్శకులు.. తమిళ హీరోలతో కలిసి పనిచేసినప్పుడు విజయవంతమైన చిత్రాలను అందించారు. సర్, లక్కీ భాస్కర్‌‌తో ఇప్పుడొచ్చిన 'కుబేర' చిత్రాలే స్పష్టమైన ఉదాహరణలు. ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర రాణించడంతో పాటు బలమైన, వైవిధ్యభరిత కథాకథనాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

మరోవైపు తెలుగు స్టార్లతో కలిసి పనిచేసిన తమిళ దర్శకులేమో అంతవరకూ చవిచూడని దారుణమైన డిజాస్టర్లకు తెర తీశారు. మహేష్‌ బాబు 'స్పైడర్‌' నుంచి రామ్‌ 'ది వారియర్', నాగ చైతన్య 'కస్టడీ', రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌'.. ఇలా ఇవన్నీ తమిళ దర్శకులు తీసినవే. ఈ సినిమాలు అటు కలెక్షన్ల పరంగా, ఇటు క్వాలిటీ  పరంగా ఏ వర్గం ప్రేక్షకులనూ మెప్పించలేకపోయాయి. ఈ సినిమాల పరాజయాలకు తమిళ దర్శకులేనా బాధ్యులు?

(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?)

ఇప్పటికైనా ఒప్పుకోక తప్పని వాస్తవం. ఆ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగు హీరోలు, వారి ఆలోచనా ధోరణి మాత్రమే అని. నిజం చెప్పాలంటే 'కుబేర'లో ధనుష్‌ పోషించిన బిచ్చగాడి పాత్రను పోషించేంత ధైర్యం.. బహుశా ధైర్యం అనకూడదేమో! నటనపై అంతటి ఇష్టం తెలుగు హీరోలకు ఉందా? ఇమేజి, గిమేజి అంటూ చేయబోయే పాత్ర విలువ కేజీల్లో కొలవకుండా ఆ బిచ్చగాడి పాత్రకి సై అనేవారా? అసాధ్యమే అనాలి. (నిజానికి ఈ పాత్ర కోసం శేఖర్‌కమ్ముల ఒకరిద్దరు తెలుగు హీరోలను ఒప్పించడానికి విఫల యత్నం చేశారని సమాచారం) కానీ అదే సమయంలో తమిళ్‌లో టాప్‌ హీరోగా వెలుగొందుతున్న ధనుష్‌ ఆ పాత్రను  అద్భుతంగా పండించాడు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకంటున్నాడు.  

అదే విధంగా మళయాల హీరో దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌' సినిమా విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఆ పాత్రను తెలుగు హీరోలు అంగీకరించలేరు. సురక్షితమైన, తమ కెరీర్‌కు గానీ, ఫాలోయింగ్‌కు గానీ ఎలాంటి ఇబ్బంది పెట్టని , హిట్‌ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌కు క్రేజీ హీరోగా నిలిపి ఉంచే లాంటి పరిమితులు... తెలుగు హీరోలను అనూహ్యమైన పాత్రల ఎంపిక నుంచి దూరంగా నెట్టేస్తున్నాయి. కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నట్టే, అభినయపరమైన అద్భుతాల ఆవిష్కరణలోనూ ముందుండాలంటే.. 'కుబేర' లాంటి విజయాలు చెబుతున్న పాఠాలను తెలుగు స్టార్స్‌ నేర్చుకోవాల్సిందే.

(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్‌.. మొత్తం ఎన్ని కోట్లు?)

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)