Breaking News

'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?

Published on Sat, 06/21/2025 - 08:02

'కుబేర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కాస్త కళకళలాడుతున్నాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన స్టైల్ కంటే ఈ మూవీని కాస్త డిఫరెంట్‌గా తీశాడు. నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం బాగుంది. చూస్తుంటే ఈ వీకెండ్ విన్నర్ ఈ మూవీనే అవుతుందేమో అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కనిపించిన స్టార్స్‌కి ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు?

తమిళ నటుడు ధనుష్.. 'కుబేర'లో హీరోగా నటించాడు. ఇందులో ఇతడిది బిచ్చగాడి పాత్ర. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇతడి నటనకు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే అంత సహజంగా నటించాడని అంటున్నారు. ఈ చిత్రంలో నటించినందుకుగానూ రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇదే మూవీలో మరో కీలక పాత్ర పోషించిన నాగార్జున.. రూ.14 కోట్ల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన)

ఇదే సినిమాలో హీరోయిన్‌గా చేసిన రష్మిక రూ.4 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుందని, మ్యూజిక్‌తో ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్ రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ కమ్ముల అయితే  రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా స్టార్ కాస్ట్ ఎక్కువ కావడంతో రూ.100 కోట్ల కంటే ఎక్కువగానే బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న టాక్ బట్టి చూస్తే నిర్మాతలు పెట్టిన మొత్తం రిటర్న్ రావొచ్చు అనిపిస్తుంది.

'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్‌ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా)

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు