Breaking News

ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన ఆదిపురుష్ భామ..!

Published on Mon, 12/16/2024 - 16:00

ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో పలు చిత్రాలతో మెప్పించింది. అయితే గత కొంతకాలంగా కృతి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.  కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్‌ చూస్తే వీరిద్దరు డేటింగ్‌లో ఉ‍న్నట్లు అర్థమవుతోంది. దీంతో కృతి సనన్‌ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కృతిసనన్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో మెరిసింది. ఆ పెళ్లి మరోవరిదో కాదు.. తన ప్రియుడు కబీర్ బహియా బంధువులదే కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో కృతి సనన్ పెళ్లి చేసుకోబోతోందా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కాగా.. గతంలో కృతి సనన్, కబీర్ బహియా కలిసి విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.  అయితే తమ రిలేషన్ గురించి వీరిద్దరు ఎక్కడా బయటికి చెప్పలేదు. కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా కృతి సనన్‌ అతనితో ఉన్న రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేసింది.

k

కబీర్ బహియా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త.  అతని తండ్రి కుల్జిందర్ బహియా యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. అతను స్టార్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సన్నిహితుడు కూడా. మరోవైపు కృతి సనన్ ఈ ఏడాది తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పట్టి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)