Breaking News

ఆజ్‌ కీ రాత్‌ రీమిక్స్‌లో..?

Published on Fri, 07/25/2025 - 03:50

షారుక్‌ ఖాన్‌తో ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌ (2006), డాన్‌ 2: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ సినిమాలను తెరకెక్కించి, హిట్స్‌ అందుకున్నారు దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌. తాజాగా ఫర్హాన్‌ డైరెక్షన్‌లోనే ‘డాన్‌ 3’ రానుంది. అయితే ‘డాన్‌ 3’ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా చేయడం లేదు. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించనున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీని ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాలేదు. కాగా ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చారు కియారా. దీంతో కియారా సెట్స్‌కు రావడం కుదరదని, ఆమె ప్లేస్‌లో మేకర్స్‌ కృతీ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

ఓ దశలో ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌ (2006), డాన్‌ 2: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంకా చోప్రా ‘డాన్‌ 3’లోనూ నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ‘ధురంధర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రణ్‌వీర్‌ సింగ్‌. డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. దీంతో ముందుగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు రణ్‌వీర్‌.

ఆ విధంగా ‘డాన్‌ 3’ చిత్రీకరణ వాయిదా పడింది. జనవరిలో షూటింగ్‌ ఆరంభించాలనుకుంటున్నారు మేకర్స్‌. ఎలాగూ ‘డాన్‌ 3’ సినిమా స్టార్ట్‌ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ముందుగా ప్రకటించినట్లుగానే హీరోయిన్‌గా కియారా అద్వానీనే నటింపజేయాలనుకుంటున్నారట. ఇక ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’ (2006) సినిమాలో ‘ఆజ్‌ కీ రాత్‌’ పాట ఉన్న విషయం తెలిసిందే. 

ఈ పాపులర్‌ సాంగ్‌ను ‘డాన్‌ 3’లో రీమిక్స్‌ చేసి, ఈ స్పెషల్‌ సాంగ్‌లో కృతీ సనన్‌తో డ్యాన్స్‌ చేయిస్తే బాగుంటుందని, ఈ సాంగ్‌లో ప్రియాంకా చోప్రా గెస్ట్‌గా కనిపిస్తే బాగుంటుందని ఫర్హాన్‌ భావిస్తున్నారట. ఆ దిశగా కృతీతో చర్చలు జరుపుతోందట ‘డాన్‌ 3’ టీమ్‌. మరి... ‘ఆజ్‌ కీ రాత్‌’ సాంగ్‌లో రణ్‌వీర్‌తో కలిసి కృతీ సనన్‌ స్టెప్పులేస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ‘డాన్, డాన్‌ 2’ చిత్రాలకు సంగీతం అందించిన శంకర్‌–ఇషాన్‌–లాయ్‌ త్రయమే ‘డాన్‌ 3’కీ సంగీతం అందించనున్నారు.  

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు