అక్కా.. నిన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నా: చెల్లి ఎమోషనల్ పోస్ట్

Published on Mon, 02/02/2026 - 19:30

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు గురించి ప్రత్యేకంగా పరిచయం ‍అక్కర్లేదు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి బిగ్‌బాగ్ 3వ సీజన్‪లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే గతేడాది వరుణ్ సందేశ్ బర్త్‌ డే కానుకగా ఏకంగా సొంతింటినే గిఫ్ట్‌గా ఇచ్చింది వితికా శేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.  అంతేకాకుండా 2025 నవంబర్‌లో తన చెల్లి సీమంతం వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన చెల్లి సీమంతాన్ని తానే దగ్గరుండి మరీ నడిపించింది.  అక్కగా అన్నీ తానై చెల్లి క్రితిక శేరు సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.

తాజాగా ఇవాళ తన అక్క వితికా శేరు బర్త్‌ డే కావడంతో చెల్లి క్రితిక శేరు విషెస్ తెలిపింది. తన కోసం అక్క చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది. తన వెంట ఉంటూ అండగా నిలిచిన అక్కకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చాలా కాలంగా నేను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నా.. బాధ్యతలను మోస్తూ.. మన కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కెరీర్‌ను నిర్మించుకుంటూనే ఉన్నావంటూ రాసుకొచ్చింది.  నా చిన్నప్పుడు ఇతరుల్లో ఉన్నంత అనుబంధం మనలో లేదని నాకు అనిపించింది.. కారణాలు తెలియకుండానే నిన్ను చాలాసార్లు ప్రశ్నించానంటూ భావోద్వేగానికి గురైంది క్రితిక శేరు.

క్రితిక శేరు తన ఇన్‌స్టాలో రాస్తూ..' నా పెళ్లి తర్వాత.. ముఖ్యంగా ఈ గర్భధారణ సమయంలో ప్రతిదీ మారిపోయింది. దూరం వల్ల నీ ప్రేమ నాకు చాలా స్పష్టంగా కనిపించింది. నువ్వు చిన్న చిన్న విషయాలను గమనించావు. నన్ను భావోద్వేగంగా.. మానసికంగా ఆదుకున్నావు. ఈ ప్రయాణాన్ని నాకు చాలా సులభతరం చేసి మరింత అందంగా మార్చావ్. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా  నా కోసం నువ్వు నిలబడ్డావ్. చివరికీ ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకున్నా అక్కా. నీ ప్రేమ నాపై ఎల్లప్పుడూ బలంగా ఉంది. నువ్వు నా కోసం చేసిన ప్రతి చిన్న పనికి ధన్యవాదాలు. ఈ రోజు నా బలం, నా మద్దతు.. నాకు అతిపెద్ద ఆశీర్వాదం నువ్వే అక్కా. నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న అభిమానులు వితికా శేరుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)