Breaking News

ఓటీటీలో దూసుకెళ్తున్న కృష్ణ బురుగులు ‘జిగ్రిస్‌’

Published on Tue, 01/20/2026 - 12:18

కృష్ణ బురుగుల, ధీరజ్‌ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రిస్‌’.ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించ‌గా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబర్‌ 14న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లో  స్ట్రీమింగ్‌ అవుతుంది. థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినా..ఓటీటీలో  మాత్రం సినిమా దూసుకెళ్తోంది. . రెండు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లలో ట్రెండ్ అవుతూ, ఈ చిత్రం ఒక రికార్డును నెలకొల్పింది. 

కేవలం ఒక్క భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీలో కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన నటనలో ఎక్కడా అతి కనిపించదు, అంతా చాలా నేచురల్ గా ఉంటుంది. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)