Breaking News

మంచి పాత్ర ఇస్తే కూర్చోనైనా నటిస్తానన్నారు: అనిల్‌ రావిపూడి

Published on Sun, 07/13/2025 - 16:24

ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మృతితో చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లెజెండరీ నటుడు ఇక లేరన్న వార్తను సినీతారలు జీర్ణించుకోలేకపోతున్నారు. కోట శ్రీనివాసరావు ఆదివారం (జూలై 13) ఉదయం ఫిలింనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి సైతం నటుడిని చివరిసారి సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాడు.

కూర్చోనైనా నటిస్తా..
ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావుగారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. దర్శకుడిగా ఆయనతో కలిసి పనిచేయలేదు కానీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చాలా చిత్రాలకు పని చేశాను. గొప్ప టైమింగ్‌ ఉన్న ఆర్టిస్ట్‌.. నవరసాల్లో ఏ పాత్రయినా గొప్పగా పోషించే నటుడు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. నేను దర్శకుడయ్యాక చాలా ఫంక్షన్స్‌లో ఆయన్ను కలిశాను. నాకు మంచి పాత్ర ఇస్తే.. ఓపిక లేకపోయినా సరే, కూర్చోనైనా నటిస్తా అన్నారు. కానీ, ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. ఎంతోమంది ఆయన్ను అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్రలతో, నటనతో మన మధ్య ఎల్లప్పుడూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు.

లేని లోటు పూడ్చలేనిది
ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనతో యావత్‌ తెలుగు జాతిని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన మహా నటుడు కోట శ్రీనివాసరావు. కామెడీ, విలన్‌, సెంటిమెంట్‌.. నవరసాలను పండించి మెప్పించి ఒప్పించిన మహానటుడు. ఆయన శకం ముగిసింది. పాన్‌ ఇండియా అని చెప్పి చాలామంది వేరే భాషా నటులను టాలీవుడ్‌లో ప్రవేశపెడుతున్నారు. దానివల్ల తెలుగులో గొప్ప నటుల టాలెంట్‌ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది కరెక్ట్‌ కాదు, ఇక్కడివారి ప్రతిభను ఉపయోగించుకోవాలి అని గొంతెత్తి ప్రశ్నించిన తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: కోట జీవితాన్ని మలుపు తిప్పిన నటుడు.. ఆ హీరో కాళ్లపై పడి నమస్కరించి..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)