Breaking News

రవితేజకు అవమానం.. అడ్డమైనవాళ్లు తింటారన్న నిర్మాత

Published on Thu, 03/05/2026 - 15:46

ఎంతోమంది స్టార్‌ హీరోలతో కలిసి పని చేశాడు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో అటు కోన వెంకట్‌కు, ఇటు రవితేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్‌ రిపీట్‌ అయింది. వెంకీ, భగీరథ, షాక్‌, డాన్‌ శీను, బలుపు, పవర్‌ సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే రవితేజ హీరో కాకముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. 

భోజనం చేస్తుండగా..
ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న ఘోర అవమానాన్ని తాజాగా కోన వెంకట్‌ బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెట్‌లో కొన్నిసార్లు కొందరు దారుణంగా మాట్లాడతారు. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భోజనం చేస్తుండగా చూసిన ఓ నిర్మాత.. లంచ్‌ టైమ్‌లో అడ్డమైనవాళ్లందరూ వచ్చి తింటారు అని చీదరించుకున్నాడు. ఎవడొస్తే వాడికి భోజనం పెడతావా? నీది కాదు కదా సొమ్ము అని వడ్డించినవాడిని తిట్టాడు. 

లెవల్‌ చూపించమన్నా..
ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పేరు చెప్తే షాకైపోతారు.. ఆయన మరెవరో కాదు, రవితేజ! అలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. కష్టాలను దాటుకుని తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అదే నిర్మాత రవితేజ డేట్స్‌ కోసం వెంటపడ్డాడు. నిన్ను అవమానించిన అతడికి నీ లెవలేంటో చూపించు, పొరపాటున కూడా డేట్స్‌ ఇవ్వకు అని నేను సలహా ఇచ్చాను.

అదే అసలైన విజయం
కానీ రవితేజ నా మాట వినలేదు. ఆ నిర్మాతకు డేట్స్‌ ఇచ్చి, అతడి బ్యానర్‌లోనే హిట్టు కొడితేనే నా దృష్టిలో అసలైన విజయం అన్నాడు. చెప్పినట్లుగానే అతడి బ్యానర్‌లో సినిమా చేసి విజయం సాధించాడు. రవితేజ స్థానంలో నేనుంటే మాత్రం సినిమా చేసేవాడిని కాదు అని కోన వెంకట్‌  చెప్పుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.

చదవండి: తనూజకు గోల్డ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దువ్వాడ మాధురి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)