Breaking News

ఆ ఓటీటీలో భారీ చిత్రాల హంగామా.. 2024లో వస్తున్న టాప్‌ సినిమాలు ఇవే

Published on Fri, 01/19/2024 - 06:58

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సంస్ధ అయిన నెట్‌ఫ్లిక్స్‌ కోలీవుడ్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. 2024లో పాన్‌  ఇండియా రేంజ్‌లో భారీ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనుంది. దీని గురించి ఆ సంస్థ నిర్వాహకురాలు మోనికా పెర్కన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ మంచి కంటెంట్‌ తక్కువ అయినా జనరంజిత చిత్రాలను అందిస్తూ అలరించే విషయంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు.

గత ఏడాది విజయ్‌ కథానాయకుడిగా నటించిన లియో, అజిత్‌ హీరోగా నటించిన తుణివు, ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటించిన మామన్నన్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను స్ట్రీమింగ్‌ చేసినట్లు తెలిపారు. అలాగే 2024లో 9 తమిళ భారీ  చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నాయని చెప్పారు. వీటిలో కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఇండియన్‌–2, అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న విడాముయర్చి, ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన కంజూరింగ్‌ కన్నప్పన్‌, కీర్తి సురేష్‌ ప్రధానపాత్రలో డ్రీమ్‌ వారియర్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న కన్నివెడి, విజయ్‌సేతుపతి కథానాయకుడిగా ఫ్యాషన్‌ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న మహరాజా చిత్రం ఉంది.

సోనీ పిక్చర్స్‌ ఫిలిమ్స్‌ శివకార్తికేయన్‌ 21వ చిత్రం ఫ్యాషన్‌ ఫిలిం ఫ్యాక్టరీ, దిరూట్‌ సంస్థలు నిర్మిస్తున్న రివాల్వర్‌ రీటా, ఎస్‌ఎన్‌ఎస్‌ ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ నిర్మిస్తున్న స్వర్గ వాసల్‌, స్టూడియో గ్రీన్‌ పతాకంపై విక్రమ్‌ కథానాయకుడిగా జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న తంగలాన్‌ చిత్రం ఉంటాయన్నారు. ఇక ఈ తొమ్మిది చిత్రాలను తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)