Breaking News

ఎవరీ మానస శర్మ? అచ్చం ఓయ్‌ హీరోయిన్‌లా ఉందే!

Published on Thu, 04/02/2026 - 13:42

గత రెండు రోజులుగా సోషల్‌ మీడియా మొత్తం తనే ఉంది. చూడటానికి అమాయకంగా, సాంప్రదాయంగా కనిపిస్తూ తెగ వైరలవుతోంది. ఆ తను మరెవరో కాదు రాకాస దర్శకురాలు మానస శర్మ. చూడటానికి ఓయ్‌ సినిమా హీరోయిన్‌ షామిలికి చెల్లెలిగా కనిపిస్తున్న ఈవిడ గురించి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. కాబట్టి ఆమె ఎవరు? ఇంతకు ముందు ఏం చేసింది? అనేది ఓసారి చూసేద్దాం..

రచయితగా
మానస శర్మది శ్రీకాకుళం.. యూట్యూబ్‌లో మ్యాడ్‌ హౌస్‌ అనే మినీ సిరీస్‌కు డైలాగ్స్‌ రాసింది. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్‌ సిరీస్‌కు రచయితగా పని చేసింది. ఈ రెండింటికీ మెగా డాటర్‌ నిహారిక కొణిదెలయే నిర్మాతగా వ్యవహరించింది. అలా నిహారిక దృష్టిలో పడింది. 2024లో సోనీ లివ్‌లో వచ్చిన బెంచ్‌ లైఫ్‌ వెబ్‌ సిరీస్‌తో దర్శకురాలిగా మారింది. తర్వాత మరోసారి నిహారికతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఆమె నిర్మించిన రాకాస చిత్రంతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయం కాబోతోంది.

ట్రెండింగ్‌లో డైరెక్టర్‌
రాకాస మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హీరో సంగీత్‌ శోభన్‌, హీరోయిన్‌ నయన్‌ సారిక కన్నా దర్శకురాలు మానసయే ఎక్కువ హైలైట్‌ అవుతోంది. మాట్లాడేది తక్కువే అయినా అమాయకత్వం, సింపుల్‌ స్మైల్‌తో ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. ఓయ్‌ హీరోయిన్‌లా కనిపించినప్పటికీ ఆమెకు, మానసకు ఎటువంటి సంబంధం లేదు. ఇకపోతే జనాలు గుర్తుపెట్టుకునేలా, వారికి నచ్చేలా సినిమాలు తీయాలనుకుంటుంది మానస. మరి ఆమె రాకాసతో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి!

నేను చాలా ఇంట్రోవర్ట్‌. కెమెరా అంటే మొహమాటం ఎక్కువ. అందుకే కెమెరా వెనకాల ఉండటానికే ప్రయత్నిస్తాను.
- మానస శర్మ

 

 

చదవండి: భార్య ఉండగా రెండో పెళ్లి.. బిడ్డ తనకు పుట్టలేదన్న నటుడికి షాకిచ్చిన డీఎన్‌ఏ రిపోర్ట్‌

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)