19 ఏళ్లకే బట్టతల.. 50 ఏళ్లు దాటినా సింగిల్‌గా!

Published on Wed, 12/17/2025 - 14:15

అందాన్ని కాపాడుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. కడుపు మాడ్చుకుంటారు, క్రీములు వాడతారు, జిమ్‌కెళ్తారు. అందం, శరీర సౌష్టవం కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే జుట్టు రాలడం మొదలైతే ఇంకేమైనా ఉందా? 

అందులోనూ అబ్బాయిలు బట్టతలతో ఆడిషన్‌కు వెళ్తే ఎవరైనా తీసుకుంటారా? అక్షయ్‌ ఖన్నాకు కూడా ఇదే భయం. కానీ భయపడుతూ కూర్చుంటే ఏదీ మారదని అర్థమై ధైర్యంగా ముందడుగు వేశాడు. లుక్‌ కన్నా టాలెంట్‌ ముఖ్యమని నిరూపించాడు. ఈ ఏడాది ఛావా, ధురంధర్‌ సినిమాలతో సెన్సేషన్‌గా మారిన ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

19 ఏళ్లకే జుట్టు రాలడం
దివంగత నటుడు, రాజకీయ నాయకుడు వినోద్‌ ఖన్నా కుమారుడే అక్షయ్‌ ఖన్నా. స్కూల్‌, కాలేజీ డేస్‌లో చదువులో కన్నా ఆటల్లోనే ఎక్కువ రాణించేవాడు. కానీ చిన్నతనంలోనే హెయిర్‌ లాస్‌ సమస్యతో బాధపడ్డాడు. 19 ఏళ్లకే ఉన్న జుట్టంతా ఊడిపోతుంటే భరించలేకపోయాడు. తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఆఫర్స్‌ వస్తాయనుకునేవాడు. 

తండ్రి సినిమాతో ఎంట్రీ
కానీ, జుట్టు రాలడాన్ని తగ్గించలేమన్న నిజాన్ని అర్థం చేసుకున్నాక తన టాలెంటే అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తండ్రి హీరోగా నటించి, నిర్మించిన హిమాలయ పుత్ర (1997) మూవీతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టాడు. అయితే అక్షయ్‌ (Akshaye Khanna)కు మంచి బ్రేక్‌ ఇచ్చింది మాత్రం తన రెండో మూవీ 'బోర్డర్‌'. ఈ చిత్రం తర్వాత అక్షయ్‌ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన మార్క్‌ సృష్టించాడు. 

వైరల్‌
దిల్‌ చహ్తా హై, హమ్‌రాజ్‌, దీవాంగే, రేస్‌, తీస్‌ మార్‌ ఖాన్‌, ఇత్తేఫఖ్‌, సెక్షన్‌ 375, దృశ్యం 2 ఇలా హిందీలో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఛావాతో తిరిగొచ్చాడు. ఔరంగజేబుగా అద్భుతంగా నటించి మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. ధురంధర్‌ చిత్రంలో తన యాక్టింగ్‌, డ్యాన్స్‌ క్లిప్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే అక్షయ్‌కు అందరిలా పార్టీలు చేసుకుంటూ ఎప్పుడై లైమ్‌లైట్‌లో ఉండే అలవాటు లేదు. 

50 ఏళ్లు దాటినా సింగిల్‌గానే..
వచ్చామా? సినిమాలు చేసుకున్నామా? అయిపోయిందా? అంతే! అన్నట్లుగా ఉంటాడు. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఈ హీరో గతంలో హీరోయిన్‌ కరిష్మా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమకథ పెళ్లిదాకా రాకముందే ఆగిపోయింది. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్‌ ఆస్తి రూ.167 కోట్లు ఉంటుందని అంచనా!

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)