Breaking News

మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్

Published on Fri, 06/20/2025 - 12:32

మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో తన పేరుతో ఉన్న పులిపిల్లని క్లీంకార తొలిసారి కలిసింది. ఈ విషయాన్ని ఉపాసన పోస్ట్ పెట్టి మరీ తన ఆనందాన్ని పంచుకుంది. గతంలో పులిపిల్లని చరణ్-ఉపాసన దంపతులు దత్తత తీసుకోగా.. ఇప్పుడు దానికి వీళ్ల కూతురి పేరు పెట్టడం విశేషం.

2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం. తర్వాత కెరీర్ పరంగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ 20న ఉపాసనకు కూతురు పుట్టింది. పాపకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు చాలాసార్లు పాపతో తీసుకున్న ఫొటోలని పోస్ట్ చేశారు కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

గతంలో చరణ్ దంపతులు.. నెహ్రూ జూలోని పులిని దత్తత తీసుకున్నారు. ఇలా చేసినందుకుగానూ హైదరాబాద్ జూ అధికారులు.. మెగా డాటర్ గౌరవార్థం ఓ పులికి క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు దాన్ని క్లీంకార ప్రత్యక్షంగా చూసింది. 'ఏడాది క్రితం ఈ పులిపిల్ల ఓ పసికూన. ఇప్పుడు శివంగిలా మారి క్లీంకార కలిసి పేరుని పంచుకుంది. ఈ విషయంలో హైదరాబాద్ జూ నిర్వహకులకు థ్యాంక్యూ. క్రూరమృగాలు అడవిలో ఉండాలి. కానీ అవి కూడా గౌరవంతో బతకాలి' అని ఉపాసన రాసుకొచ్చింది. ఇది ఇప్పుడు మెగా అభిమానులకు నచ్చేస్తోంది.

చరణ్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గేమ్ ఛేంజర్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైంది. కానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మూడు నెలల క్రితం రిలీజైన గ్లింప్స్ వీడియో ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. 

(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?