Breaking News

'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?

Published on Sat, 09/13/2025 - 15:44

ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒకటి తేజ సజ్జా 'మిరాయ్' కాగా.. మరొకటి బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కింధపురి'. అయితే ఈ రెండింటికీ యునానిమస్ హిట్ టాక్ ఏం రాలేదు. కొందరికి ఈ చిత్రాలు నచ్చగా.. మరికొందరు మాత్రం రెండూ యావరేజ్‍‪‌గానే ఉన్నాయని అంటున్నారు. కలెక్షన్ విషయానికొస్తే 'మిరాయ్'కి రూ.27.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అధికారికంగానే వెల్లడించారు.

(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్‌ జోన్‌లో వీళ్లే.. లక్స్‌ పాపపై ఎలిమినేషన్‌ వేటు?)

మరోవైపు 'కిష్కింధపురి' టీమ్ నుంచి అధికారిక ప్రకటన అయితే ఏం లేదు. కానీ తొలిరోజు ఈ చిత్రానికి ఓ మాదిరి వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రం ఈ చిత్రం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కాస్తోకూస్తో ఎంటర్‌టైన్ చేస్తోంది. అయితే 'మిరాయ్' వల్ల కాస్త నంబర్స్ తగ్గొచ్చు గానీ 25వ తేదీ వరకు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం లేవు. ఇది 'కిష్కింధపురి'కి ఏమైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.

'కిష్కింధపురి' విషయానికొస్తే.. రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి(అనుపమ) లవర్స్. ఓ సంస్థలో పనిచేస్తుంటారు. ఘోస్ట్ వాకింగ్ టూర్స్ పేరుతో కొందరిని హాంటెడ్ ప్లేసులకు పట్టుకెళ్తుంటారు. ఓ సందర్భంలో ఊరికి చివరలో ఉన్న 'సువర్ణమాయ రేడియో స్టేషన్'కి వెళ్లొస్తారు. అలా వెళ్లొచ్చిన 11 మందిలో ముగ్గురు చనిపోతారు. దీంతో అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అని రాఘవ్ కనుక్కొనే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ రేడియో స్టేషన్‌లో ఉన్న దెయ్యం ఎవరు? చివరకు రాఘవ్ అతడితోపాటు వెళ్లిన వాళ్లు బతికారా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)