Breaking News

ఓటీటీలోకి దేవరకొండ 'కింగ్డమ్'.. అధికారిక ప్రకటన

Published on Mon, 08/25/2025 - 15:48

విజయ్ దేవరకొండ గత నెలలో 'కింగ్డమ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలుమార్లు వాయిదా పడిన చిత్రం.. గత నెల చివరలో థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజైన ఒకటి రెండు రోజులు హడావుడి నడిచింది. కానీ తర్వాత నెగిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. దీంతో నష్టాలు మూటగట్టుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి రానుందంటే?

విజయ్ దేవరకొండ-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'కింగ్డమ్' చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ నిర్మాత. జూలై 31న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పడు ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు) 

'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్)  కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలోనే పోలీస్ అధికారులతో సూరికి గొడవ జరుగుతుంది. అయితే ఉద్యోగం నుంచి తీసేయకుండా ఓ సీక్రెట్ మిషన్ అప్పజెబుతారు. శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు.

అన్న కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమైన సూరి.. శ్రీలంకలో అడుగుపెడతాడు. మరి సూరికి తన అన్న శివ దొరికాడా లేదా? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)