Breaking News

'కింగ్డమ్' ఓటీటీ డీటైల్స్.. ఎప్పుడు రావొచ్చు?

Published on Thu, 07/31/2025 - 16:14

విజయ్ దేవరకొండ హిట్ పడి చాలా కాలమైంది. దీంతో తన లేటెస్ట్ సినిమా 'కింగ్డమ్'పై బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఒకటి రెండు రోజులు ఆగితే అసలు రిజల్ట్ ఏంటనేది బయటపడుతుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్ ఏంటి? ఎప్పుడు రావొచ్చు?

ఒకప్పటితో పోలిస్తే థియేటర్లకు జనాలు బాగానే వెళ్తున్నారు. ఆగస్టు 14 వరకు మరో పెద్ద మూవీ లేదు కాబట్టి.. 'కింగ్డమ్'కి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కానీ ఏ మేరకు దాన్ని క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. అలానే కలెక్షన్ కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నిర్మాణ సంస్థ ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు విక్రయించింది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?

(కింగ్డమ్‌ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

రీసెంట్ టైంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసే సినిమాల్ని దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. 'కింగ్డమ్' కూడా అలానే దక్కించుకుంది. అలానే ఈ చిత్రాలన్ని చాలావరకు నాలుగు వారాల గ్యాప్‌తోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ మూవీ కూడా అలానే రావొచ్చని తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబరు తొలివారంలో 'కింగ్డమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘కింగ్డమ్‌’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)