Breaking News

'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?

Published on Wed, 07/30/2025 - 15:05

'అర్జున్ రెడ్డి', 'గీతగీవిందం' సినిమాల తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'కింగ్డమ్' చేశాడు. దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నాడు. అందుకు తగ్గట్లే మూవీపై హైప్ రోజురోజుకీ బాగానే పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్స్‌లోనూ అది క్లియర్‌గా కనిపిస్తోంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ నడుస్తోంది.

శ్రీలంక బ్యాక్ డ్రాప్‌లో తీసిన 'కింగ్డమ్' సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్‌తోపాటు యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. అనిరుధ్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవి కూడా మూవీపై కాస్త అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, అన్న పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.

(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)

విజయ్ దేవరకొండ సూరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కానిస్టేబుల్, అండర్ కవర్ ఏజెంట్, ఖైదీ.. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకుగానూ విజయ్‌ రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడి తర్వాత అనిరుధ్‌కి రూ.10 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ రూ.7 కోట్లు వరకు అందుకున్నట్లు టాక్. అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కి రూ.3 కోట్లు, హీరోయిన్‌గా చేసిన భాగ్యశ్రీకి రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. 'కింగ్డమ్' చిత్రానికి మొత్తంగా రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు చెప్పుకొచ్చారు. వీటిలో ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మంచి రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్‌లో హిట్ టాక్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశముంది. ఎందుకంటే ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో ఇదే పెద్ద చిత్రం. మరో రెండు వారాల తర్వాత గానీ కూలీ, వార్ 2 రావు. హిట్ టాక్ వస్తే అప్పటివరకు 'కింగ్డమ్'దే హవా.

(ఇదీ చదవండి: 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)