Breaking News

కింగ్‌డమ్‌ మూవీపై వివాదం.. స్పందించిన నిర్మాణ సంస్థ!

Published on Wed, 08/06/2025 - 16:16

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్‌ థ్రిల్లర్‌ కింగ్‌డమ్. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం వంద కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.

అయితే బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై వివాదం మొదలైంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌ శ్రీలంక తమిళులను కించపరిచేలా ఉన్నాయని తమిళ అనుకూల పార్టీ అయిన నామ్ తమిజర్ కట్చి (NTK) కార్యకర్తలు ఆరోపించారు. దీంతో తమిళనాడులోని మధురై, తిరుచ్చిలోని థియేటర్ల వద్ద కింగ్‌డమ్‌ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ చిత్రం ప్రదర్శనను నిషేధించాలని వారు పిలుపునిచ్చారు.

అయితే తాజాగా ఈ వివాదంపై కింగ్‌డమ్‌ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పందించింది. ఈ సినిమాలో శ్రీలంక తమిళులను కించపరచలేదని.. తమపై వస్తున్న కథనాలను ఖండించింది. ఈ కథ అంతా కల్పితమని.. నిజ జీవిత సంఘటనలకు సంబంధించినది కాదని నిర్మాతలు తెలిపారు.

"తమిళ ప్రజల మనోభావాలను మేము గౌరవిస్తున్నాము. పక్క రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు లేవని మేము హామీ ఇస్తున్నాం. ఈ కథ పూర్తిగా కల్పితం. అంతా ఊహజనితమే. ఇదంతా సినిమా డిస్‌క్లైమర్‌లోనే ‍ప్రస్తావించాం' సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటే చింతిస్తున్నామని తెలిపింది. మీరు మా సినిమాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమిళనాడులోని సినిమా పంపిణీదారులు పోలీసు రక్షణ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. శ్రీలంక నేపథ్యంలోనే కింగ్‌డమ్‌ మూవీని తెరకెక్కించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)