Breaking News

ఓటీటీలోకి అదిరిపోయే థ్రిల్లర్‌.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published on Thu, 03/06/2025 - 10:19

ఓటీటీలోకి అదిరిపోయే క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ రానుంది. 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఇందులో జీత్‌, ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ వంటి స్టార్స్‌ నటించారు. ఈ మూవీతో భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఇప్పటికే వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌ ట్రైలర్‌ ఈవెంట్‌లో నిర్మాత నీరజ్‌ పాండే పరోక్షంగా గంగూలీ ఉండొచ్చు అనే కామెంట్‌ చేశారు.

'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళంలో అందుబాటులో ఉండనుంది.2000 సంవత్సరంలో బెంగాల్‌లోని పరిస్థితులను చూపిస్తూ ఈ సిరీస్‌ను దర్శకుడు దేబాత్మ మండల్ తెరకెక్కించారు.  గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులలో అధికార దాహం ఉంటే.. అక్కడి నగరంలో శాంతిని కాపాడటానికి పోలీసు అధికారులు చాలా కష్టపడుతుంటారు. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఐపీఎస్‌ అర్జున్‌ మైత్రా చట్టాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొన్నారనేది ఇందులో చూపారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.  

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్‌ చాప్టర్‌’కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్‌ తెరకెక్కించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్‌ సంచలన విజయాన్ని అందుకుంది. బిహార్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌ సిరీస్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్‌ అధికారి అమిత్‌ ఒక గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్‌ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్‌ సీరిస్‌. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)