Breaking News

స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?

Published on Sun, 04/20/2025 - 13:20

బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా పరిస్థితి అస్సలేం బాగోలేదు. మరీ ముఖ్యంగా కొందరు స్టార్ హీరోలు హిట్ ముఖం చూసి చాలారోజులైంది. అలాంటి వారిలో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే ఇతడికి గత ఐదేళ్లలో సరైన హిట్ అన్నదే పడలేదు. ఇన్నాళ్లకు సాలిడ్ సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇ‍ప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'(Kesari Chapter 2). గతంలో వచ్చిన దేశభక్తి నేపథ్యంగా వచ్చిన 'కేసరి'కి దీన్ని కొనసాగింపుగా తెరకెక్కించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్య కథతో రెండో భాగాన్ని తీశారు. ఇందులో అక్షయ్ తో పాటు మాధవన్, అనన్య పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు రూ.7.84 కోట్లు సొంతం చేసుకోగా.. రెండో రోజుకి రూ.10.08 కోట్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో రూ.17.92 కోట్ల వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోకి ఈ కలెక్షన్స్ తక్కువగానే స్టడీగా ఉన్న ఈ వసూళ్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్‌)

కేసరి 2 విషయానికొస్తే.. 19191లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరతాడు.

కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. జనరల్ డయ్యర్ పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో చేరిన రష్మీ గౌతమ్‌..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)