మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
'అతన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు'.. డైరెక్టర్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Published on Mon, 02/23/2026 - 16:05
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.
తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఈ మూవీపై విమర్శలు చేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో ఆయన మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ-2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ స్పందించారు. అనురాగ్‌కు అన్నింటితో సమస్యలేనని కామాఖ్య నారాయణ ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదేమోనని అన్నారు.
కామాఖ్య నారాయణ్ మాట్లాడుతూ..'బహుశా అనురాగ్ మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటున్నా. ఆయనకు అన్నింటితో సమస్యే. సమాజంలో ఒక వర్గం ప్రజలతో.. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీతోనూ ఆయనకు ఇబ్బందులే. అనురాగ్ తాను తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సన్నివేశాలను చూపించారు. ఈ ఆధునిక సమాజంలో ఊహకు కూడా అందని వాటిని కూడా చిత్రీకరించారు. ప్రేక్షకులు ఆయన మాటలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags : 1