Breaking News

నా తప్పేమీ లేదు.. అది ఆలస్యంగా తెలుసుకున్నా: కీర్తి సురేశ్‌

Published on Mon, 10/26/2026 - 13:13

ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన చాలా అవసరం. అయితే మహిళలు కొన్ని ఆశయాలతో ముందుకు సాగుతున్నప్పుడు కొందరి నుంచి అసహనం, అభద్రతాభావం ఎదురవుతుంది. అలా తన కెరీర్‌లోనూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నానని హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ తెలిపింది.

కీర్తి సురేశ్‌, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘అక్క’. అక్టోబర్‌ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. మహిళలు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, హోదా సంపాదించుకుని తమ చుట్టూ ఉన్నవారిపై ఆధిపత్యం చెలాయించే కథాంశంతో ఈ సిరీస్‌ రూపొందినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

చివరకు అసలు విషయం తెలిసింది!
కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. ‘ఆశయాలు ఉన్న మహిళలను చూసినప్పుడు కొందరిలో అభద్రతాభావం ఎందుకు కలుగుతుందో అర్థం కాదు. కొందరు అభద్రతాభావంతో ఉన్న సహనటులతో కలిసి పనిచేసిన సందర్భాలు నాకు ఎదురయ్యాయి. మొదట్లో వారి ప్రవర్తనకు నాలో ఏదో లోపం ఉందేమోనని అనిపించింది. అయితే షూటింగ్‌ ముగిసే సమయానికి అసలు విషయం అర్థమైంది. నాలోనే ఆ సమస్య ఉందని అనుకున్నాను. కానీ వాస్తవానికి అవతలి వ్యక్తుల అభద్రతాభావమే నన్ను అలా ఆలోచించేలా చేసింది’ అని వివరించింది.

మహిళలే అండగా ఉంటారని అనుకోవద్దు
రాధికా ఆప్టే మాట్లాడుతూ.. మనకు అండగా ఉంటారని భావించిన మహిళలు సైతం కొన్ని సందర్భాల్లో మద్దతు ఇవ్వకపోవచ్చని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం సినిమా సెట్లలో మహిళల సంఖ్య పెరిగిందని, అందరిని ఒకేలా చూడడం కూడా మెరుగుపడుతోందని పేర్కొంది. కాగా ‘అక్క’లో కీర్తి సురేశ్‌, రాధికా ఆప్టేతో పాటు తన్వీ ఆజ్మీ, మహేశ్‌ మంజ్రేకర్‌, అన్షుమన్‌ పుష్కర్‌, మోనికా పన్వార్‌ కీలక పాత్రల్లో నటించారు. మహిళల ఆశయాలు, ఆధిపత్యం, పరస్పర సంబంధాల చుట్టూ సాగే ఈ సిరీస్‌ అక్టోబర్‌ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

(ఇదీ చదవండి: మరోసారి హిట్‌ కాంబో రిపీట్‌.. రజనీ కొత్త సినిమాలో నయనతార)
 

Videos

అభిషేక్ విధ్వంసం! పాక్ క్రికెటర్లు ఫిదా!

IMD హెచ్చరిక... కోస్తా కొట్టుకుపోయేలా తుఫాన్ బీభత్సం

కావ్య-అనిరుధ్ పెళ్లి .. అతిథుల లిస్ట్ లో ఏకైక టాలీవుడ్ హీరో

పులివెందులలో YSRCP ఘన విజయం పక్కా... జగన్ ఇచ్చిన ధైర్యంతో... !

ఎన్నికల రిగ్గింగ్ విన్నా కానీ.. నామినేషన్ ల రిగ్గింగ్ ఇప్పుడే చూస్తున్నా...

తుపాను అర్నాబ్ ని దగ్గరుండి తీరాన్ని దాటించిన బాబు...! బిల్డప్..ఏకిపారేసిన వెంకటరెడ్డి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ 3శాతం DA పెంపు

కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అంబానీ

ఈ మూడు జిల్లాలకు హై అలెర్ట్ మరో 24గంటల్లో....

ఒకే ట్రాక్ పై రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ... స్పాట్ లో 46 మంది..

Photos

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఉపాసన (ఫొటోలు)

+5

విజయనగరం : జోరువానలో ఘనంగా సిరిమాను ఉత్సవం (ఫోటోలు)

+5

విశాఖపట్నంలో 'అర్నబ్' తుఫాన్ బీభత్సం (ఫోటోలు)

+5

మహోగ్రరూపం.. విరుచుకుపడిన అర్నబ్‌ తుపాన్‌ (ఫోటోలు)