Breaking News

నిశ్చితార్థం ఫిక్స్‌.. కాబోయే భర్తతో కలిసి కార్డులు పంచుతున్న కీర్తి

Published on Fri, 07/28/2023 - 13:16

బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి కీర్తి భట్‌.. హీరో విజయ కార్తీక్‌ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! వీరిద్దరి ప్రేమకు కార్తీక్‌ కుటుంబం కూడా పచ్చజెండా ఊపింది. తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినా కీర్తిని కోడలిగా తెచ్చుకునేందుకు సిద్ధమైంది. కీర్తియే తమకు చిన్నపిల్ల అని, కావాలంటే వేరే పిల్లల్ని దత్తత తీసుకుంటామని పెద్ద మనసుతో వీరి ప్రేమను అర్థం చేసుకున్నారు కార్తీక్‌ తల్లిదండ్రులు. ఇటీవలే ఓ షోలో కీర్తి, కార్తీక్‌ దండలు కూడా మార్చుకున్నారు.

తాజాగా వీరి పెళ్లి పనులు షురూ అయ్యాయి. కీర్తి-కార్తీక్‌ల నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు రావాల్సిందిగా తమ బంధుమిత్రులకు ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. ఈ క్రమంలో జానకి కలగనలేదు సీరియల్‌ నటి ప్రియాంక జైన్‌, నటుడు అమర్‌ దీప్‌ దగ్గరకు వెళ్లి కార్డులు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రియాంక తన యూట్యూబ్‌ ఛానల్‌లో తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

ఇందులో జానకి కలగనలేదు సీరియల్‌ సెట్‌లోకి వెళ్లిన కీర్తి, కార్తీక్‌ అక్కడున్న అందరికీ ఆహ్వానపత్రికలు పంచారు. ఆగస్టు 20న బేగంపేట్‌లో నిశ్చితార్థం జరగనున్నట్లు వెల్లడించారు. ఆ కార్డు చూశాక ప్రియాంక జైన్‌.. నిజంగానే మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? అని తిక్క ప్రశ్న వేసింది. పెళ్లి మాట ఎత్తితేనే తనకు భయమేస్తుందని చెప్పుకొచ్చింది. అయితే మీరు మంచి జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది. మొత్తానికి కీర్తి ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ను ఈ వీడియోతో లీక్‌ చేసింది జానకి. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న జంటకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: కోట్ల ఆస్తి.. 30 ఏళ్లకే అనాథలా తనువు చాలించిన హీరోయిన్‌
ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)