జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ
ఓటీటీలోకి కాయదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా
Published on Fri, 10/23/2026 - 18:52
ట్రెండింగ్ హీరోయిన్ కాయదు లోహర్.. దక్షిణాదిలో కన్నడ తప్పితే మిగిలిన భాషల్లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన ఓ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?
(ఇదీ చదవండి: హీరోయిన్ అవ్వాలని నేను అనుకోలేదు: నాగదుర్గ)
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అప్పుడప్పుడు హీరోగానూ సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిందే 'ఇమ్మోర్టల్'. జూలైలో థియేటర్లలోకి వస్తుందన్నారు గానీ వాయిదాలు పడి సెప్టెంబరు 19న తెలుగులో రిలీజైంది. కాయదు లోహర్ ఇందులో దెయ్యం పాత్ర చేసింది. ఈపాటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేయాలి కానీ ఆలస్యమైంది. ఇప్పుడు ఎట్టకేలకు వచ్చే శుక్రవారం(అక్టోబర్ 30) నుంచి సోనీ లివ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
'ఇమ్మోర్టల్' విషయానికొస్తే.. మహి (జీవీ ప్రకాశ్‌కుమార్) హైదరాబాద్‌లోని తన మామయ్య ప్రింటింగ్ ప్రెస్‌లో డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. అద్దె ఇంటి యజమాని పెట్టే పోరు భరించలేక వేరే ఇంటి కోసం వెతుకుతుంటాడు. తన జీతానికి తగిన ఇల్లు కోసం వెతుకున్న టైంలో సింధు (కయాదు లోహర్) అనే అమ్మాయి ఫోన్ చేసి షేరింగ్ ఫ్లాట్ గురించి చెప్పడంతో ఆమె ఫ్లాట్‌కు వెళ్తాడు. తొలి చూపులోనే సింధుని చూసి ప్రేమలో పడతాడు. సింధు కూడా కలివిడిగా ఉంటూ మహితో ఇట్టే కలిసిపోతుంది. అతను ఏం అడిగితే అది క్షణాల్లో కొని పెడుతుంటుంది.
అయితే అదే ఫ్లాట్‌లో ఉంటున్న సింధు తాతయ్య ఆకాశ్ (టీమ్ కార్తిక్) ద్వారా ఆమె గురించి ఓ రహస్యం మహికి తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత భయంతో వణికిపోతాడు. ఆ ఫ్లాట్ నుంచి, అపార్ట్మెంట్ నుంచి పారిపోదామనుకుంటాడు. ఎంత ట్రై చేసినా తిరిగి అక్కడికే వస్తుంటాడు. ఇంతకీ సింధు గురించి మహికి తెలిసిన నిజమేంటి? వెయ్యేళ్ల కిందట ఆటవిక జాతిలో పుట్టిన మృగానికీ సింధుకూ ఉన్న సంబంధమేంటి? మహి ఆ అపార్ట్మెంట్ నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))
Oru pudhu ulagam... Oru IMMORTAL kadhal! ❤️ #Immortal streaming from 30th Oct On Sony LIV #GvPrakash #KayaduLohar #SonyLiv #SonyLIVTamil @gvprakash https://t.co/ZGRhaB4Uhv
— Sony LIV Tamil (@SonylivTam) October 23, 2026
Tags : 1