భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
కార్తీ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
Published on Mon, 08/31/2026 - 21:11
కోలీవుడ్ హీరో కార్తి నటించిన సీక్వెల్ సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన సర్దార్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మిషన్ చుట్టూ కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విలన్గా ఎస్జే సూర్య కనిపించడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతమందించారు.
#Sardar2 Trailer is here!
Tamil : https://t.co/XetVn1ESqf
Telugu : https://t.co/bDJ6ffBYWB#Sardar2FromSep10— Karthi (@Karthi_Offl) August 31, 2026
Tags : 1