Breaking News

థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో ఊహించని రెస్పాన్స్..!

Published on Mon, 10/05/2026 - 11:20

కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ హీరోగా సీక్వెల్ సినిమా ‘సర్దార్ 2’ . ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. గతంలో వచ్చిన సర్దార్‌కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2022లో వచ్చిన సర్దార్‌ హిట్ కావడంతో సీక్వెల్ తీశారు. గత నెల 10న థియేటర్లలో రిలీజ్ చేశారు.  ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

దీంతో కేవలం 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది.అక్టోబరు 01 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఊహించని విధంగా సర్దార్-2 ఓటీటీలో దూసుకెళ్తోంది. అమెజాన్‌ ప్రైమ్ ఇండియా ‍వ్యాప్తంగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోని ఆడియన్స్.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో మెప్పించారు.

సర్దార్-2 కథేంటంటే..

‘సర్దార్’ముంగింపే ఈ చిత్రానికి  ప్రారంభం. ఇన్‌స్పెక్టర్‌ నుంచి రా ఏజెంట్‌గా మారిన విజయ్‌ ప్రకాశ్‌(కార్తి).. రా చీఫ్‌ మనోజ్‌ బొమ్మై (ఆశిష్‌ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్‌  చేపడతాడు. అందులో భాగంగా మాజీ రా ఏజెంట్‌ వాల్‌రస్‌ (అచ్యుత్‌ కుమార్‌)ని కలుస్తారు. అయితే అప్పటికే ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్‌ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషులను అతనిపై దాడి చేస్తారు. చనిపోయే ముందు , విజయ్‌ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇస్తాడు. అలాంటి మరో కీని మరో రా ఏజెంట్‌ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్‌ రంగనాథ్‌)కు ఇస్తుంది. డి.ఆర్.డి.వో. ఛీఫ్‌ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఇంకో కీ ఉందదే విషయం తెలుస్తుంది. దానిని సంపాదిస్తే.. ఓ భారీ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని రక్షించొచ్చు అని విజయ్‌  భావిస్తాడు.

అయితే విజయ్‌ కంటే ముందే బ్లాక్‌ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమవుతాడు. సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగుతాడు సర్దార్(కార్తి). ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్ధార్ తిరిగి ఎలా వచ్చాడు? బ్లాక్‌ డగ్గర్‌  మిషన్‌ ఏంటి? మూడు ‘కీ’ల వెనుక ఉన్న రహస్య కథేంటి? బ్లాక్‌ దగ్గర్‌ మిషన్‌ని అడ్డుకునేందుకు తన కొడుకు విజయ్‌తో కలిసి సర్దార్‌ చేసిన సాహసాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)