నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్
Published on Sun, 09/20/2026 - 07:32
ఓటీటీ ప్రియులకు మరో హారర్ థ్రిల్లర్ సిద్ధమైంది. ‘జబర్దస్త్’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ‘అదిరే అభి’ తెరకెక్కించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కర్మాఖ్య’. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
జులై 31న థియేటర్లలో విడుదలై..
జులై 31న థియేటర్లలో విడుదలైన ‘కర్మాఖ్య’ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు నిన్న (శనివారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో చూడొచ్చు.
‘కర్మాఖ్య’కు అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. సమైరా, సముద్రఖని, ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్, మధునందన్, ధనరాజ్, గడ్డం నవీన్, వైష్ణవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మై ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వడ్డేపల్లి వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్, మిస్టరీ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులు ఇప్పుడు ‘కర్మాఖ్య’ను ఇంట్లోనే చూసేయొచ్చు.
ఇదీ చదవండి: బన్నీ ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
Tags : 1