Breaking News

రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ

Published on Tue, 09/09/2025 - 17:31

బాలీవుడ్‌లో మరో ఆస్తి వివాదం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తమకు సవతి తల్లి ఫేక్ వీలునామా ఇచ్చిందని ఈ పిల్లలిద్దరూ ఆరోపణ చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరుగుతోంది?

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. అంటే కరిష్మా రెండో భార్య. దాదాపు 13 ఏళ్ల పాటు ఈమెతో కలిసున్న సంజయ్.. 2016లో విడాకులు ఇచ్చేశాడు. వీళ్లకు సమైరా, కియాన్ అని ఇద్దరు పిల్లలు. కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్.. ప్రియ సచ్‌దేవ్‌ని వివాహమాడాడు.

(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)

ఈ ఏడాది జూన్‌లో సంజయ్ కపూర్.. గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుంచి తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్‌లోనూ నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు గానీ ఆమె నిరాకరిస్తోందని పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టుని ఆశ్రయించారు.

సంజయ్‌ కపూర్‌ రాసిచ్చిన అసలు వీలునామా దాచిపెట్టి నకిలీది సవతి తల్లి ప్రియ తమకు చూపించిందనేది కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ. మరోవైపు ప్రియ సచ్‌దేవ్‌తో పాటు పలువురు వ్యక్తులు బలవంతంగా తమ తల్లి నుంచి సంతకాలు తీసుకున్నారని సంజయ్‌ సోదరి మందిర కపూర్‌ మీడియాకు చెప్పింది. దీంతో ఇది కాస్త ఇ‍ప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ మరణించే నాటికి అతడి ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు అని సమాచారం.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)