Breaking News

రింగ్‌లో దిగనున్న 'కరాటే కిడ్‌: లెజెండ్స్‌'.. ఎప్పుడంటే

Published on Mon, 05/26/2025 - 06:51

హాలీవుడ్‌ చిత్రాలకు భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి, ఆదరణ ఉంటుంది. అలా ఇంతకుముందు వచ్చిన కరాటే కిడ్‌ 5 ఫ్రాంచైజ్‌ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆలరించాయి. తాజాగా ఆ కోవలో వస్తున్న చిత్రం కరాటే కిడ్‌: లెజెండ్స్‌. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో డేనియల్ లారుస్సోగా ప్రధాన పాత్రను పోషించిన రాల్ఫ్‌ మాచియో తన భావాలను పంచుకుంటూ కరాటే కిడ్‌: లెజెండ్స్‌ చిత్రంలో మరోసారి లారుస్సో పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. 

ఈ చిత్రంలో జాకీచాన్‌, మిస్టర్‌ హాన్‌లతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఒక నటుడుగా, ఎంటర్‌టైనర్‌గా జాకీచాన్‌ పట్ల తనకు ఎంతో గౌరవం అన్నారు. ఈ రంగంలో ఆయన ఒక లెజెండ్‌ అని, చిత్రాల్లో మార్షల్‌ ఆర్ట్స్‌, కామెడీ సన్నివేశాల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. అదే విధంగా మిస్టర్‌ మియాగి అంటే కూడా తనకు చాలా గౌరవం అని రాల్ఫ్‌ మాచియో చెప్పారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లిష్‌ ,తమిళం, తెలుగు భాషల్లో మే 30వ తేదీన తెరపైకి రానుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)