Breaking News

కంపడు, గవ్వరాజు ఎవరో చెప్పిన 'కన్నప్ప'

Published on Mon, 08/19/2024 - 20:41

డైనమిక్‌ హీరో  మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్‌ అప్టేట్స్‌ను నిరంతరం అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్‌ను ప్రకటిస్తున్నారు. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్‌ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్‌, దేవరాజ్‌ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నారు. 

తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముఖేష్‌ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల  జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. 

పోస్టర్‌లో వారి లుక్‌ ఫెరోషియస్‌గా కనిపిస్తుంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్  సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. "కన్నప్ప"  అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందే విధంగా, మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే విధంగా మేకర్స్‌ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇక సినిమా పట్ల అంకితభావంతో.. ఇష్టంతో  విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో  పోషిస్తున్నారు. 

డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ముఖేష్ కుమార్  దర్శకుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్‌ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్‌ వండర్‌ను  డిసెంబర్‌లో పాన్‌ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)