Breaking News

ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.. గొడవలు ఆగిపోతే బాగుండు: మంచు విష్ణు

Published on Sat, 02/22/2025 - 19:08

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప (Kannappa Movie). ఇందులో విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్‌ కథానాయికగా యాక్ట్‌ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసినప్పటి నుంచి టీజర్‌ వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్‌ అంతా కొట్టుకుపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. 

ఎన్ని జన్మలెత్తినా..
శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్‌బాబు (Mohan Babu) నాకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్‌స్టాప్‌ పడితే బాగుండనిపిస్తోంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. ట్రోలింగ్‌ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రవర్తించాలి. 

నాకేం తెలీదు
మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని అవతలివారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకూడదు. హీరోల గురించి ఎందుకు అసభ్యంగా మాట్లాడతారు? సీనియర్‌ నటులు చనిపోయారని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కోట శ్రీనివాసరావు గురించి ఇలాంటి ప్రచారమే జరిగినప్పుడు ఆయన నాకు ఫోన్‌ చేసి విపరీతంగా బాధపడ్డారు. ఇకపోతే ప్రభాస్‌ పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి నాకెలాంటి విషయాలు తెలియవు.

గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి
కన్నప్ప సినిమా బడ్జెట్‌ విషయంలో ఇప్పటికీ నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్నా. అయినా సక్సెస్‌- ఫెయిల్యూర్‌ రెండూ మోసగాళ్లే! ఎవరూ మనతో శాశ్వతంగా ఉండరు అన్నాడు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్‌బాబు, శరత్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, కాజల్‌ అగర్వాల్‌, అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్‌ రివర్స్‌?!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)